schedule Thursday, September 03, 2026

యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద

calendar_today July 4, 2026
person dharshininews
యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద
యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద - ఆయన స్పూర్తితో సామాజిక, రాజకీయాల్లో రాణించాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : యువతలో సామాజిక, సేవా స్పూర్తిని నింపిన స్వామి వివేకానంద మార్గదర్శిగా నిలిచారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్దంతిని నిర్వహించారు. పట్టణంలోని శాంత్ మహల్‌ చౌరస్తా సమీపంలో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం మాత్రమే కాకుండా నాయకత్వ లక్షణాలను కూడా అందించారని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, రాజకీయ చైతన్యం, బాధ్యతాయుత నాయకత్వంతో ముందుకు సాగినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, అనిత, మంజుల, నర్సమ్మ, మొబాపూర్ మంజుల, పర్మేశ్, దుబాయ్ వెంకట్, బాబా గౌడ్, వెంకటస్వామి, వెంకటేష్, వివేక్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43683/