schedule Saturday, July 04, 2026

వైద్యులు దైవస్వరూపులు..!

calendar_today July 1, 2026
person dharshininews
వైద్యులు దైవస్వరూపులు..!
వైద్యులు దైవస్వరూపులు..! - సమాజంలో డాక్టర్ల సేవలు మరవలేనివి - ఆర్బీఓఎల్ సీఈఓ, ఎండీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మనషుల ప్రాణాలను కాపాడే వైద్యులు దైవ స్వరూపులని తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులు అభివర్ణించారు. బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా ఆయన నివాసంలో తాండూరుకు చెందిన వైద్యులను సన్మానించారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డిలు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరిః అనే నానుడికి తగ్గట్టుగానే వైద్యులు ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, ప్రాణాలను కాపాడే దైవస్వరూపులని అన్నారు. నిస్వార్థ సేవ, మానవత్వం, అంకితభావంతో ప్రాణాలను కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. వైద్య వృత్తిలో ఉన్నంత కాలం సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డా.జయప్రసాద్, వైద్యులు డా. శెట్టి రవిశంకర్, డా.ఆనంద్ గోపాల్ రెడ్డి, డా. శరత్‌ చంద్ర, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43660/