schedule Friday, September 04, 2026

కౌన్సిలర్ భార్యకు డబుల్‌ బెడ్ రూం

calendar_today June 27, 2026
person dharshininews
కౌన్సిలర్ భార్యకు డబుల్‌ బెడ్ రూం
కౌన్సిలర్ భార్యకు డబుల్‌ బెడ్ రూం - ఎంపికలో బయటపడిన పేరు - దుమారంతో చర్చనీయాంశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని డబుల్‌ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల్లో మున్సిపల్‌ కౌన్సిలర్ భార్య పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాజకీయాల్లో దుమారానికి దారి తీసింది. కౌన్సిలర్‌ భార్యకు డబుల్‌ బెడ్‌ కోసం ఎంపిక కావడం ఏంటనీ చర్చనీయాంశంగా మారింది. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌ రూం లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. రాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసిన వార్డుల వారిగి ఎంపిక చేసిన లబ్దిదారుల వివరాల్లో పట్టణంలోని 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ భార్య పేరు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్‌ భార్య పేరు రావడంతో చర్చనీయాంశమైంది. కౌన్సిలర్‌గా ఉండి.. డబుల్‌ బెడ్ రూం కోసం దరఖాస్తు చేసుకోవడం ఏంటని చర్చించుకున్నారు. కౌన్సిలర్‌కు సొంత వార్డులోనే పెద్ద భవనం ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవడంపై పెదవి విరుపులు చేశారు. https://www.dharshininews.com/43620/