రైతు బీమా బాండ్ లో తప్పుల సవరణకు అవకాశం
August 18, 2021
dharshininews
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైతు బీమా బాండ్లలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు తాండూర్ వ్యవసాయ అధికారులు తెలిపారు. బీమా బాండ్లను పొందిన రైతులు అందులోని తప్పులను సవరించుకోవాలని సూచించారు. తాండూరు నియోజకవర్గంలో వివిధ మండలంలో ఉన్న అన్ని గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
పంటల వివరాలు కూడా...
--------‐---‐------‐-----‐--------
అదేవిధంగా రైతులు గ్రామాల్లో పండిస్తున్న వ్యవసాయ సాగు పంట వివరాలను కూడా నమోదు చేసుకోవాలని అన్నారు. నమోదు చేసుకున్న పంటల వివరాలు ఆన్ లైన్ లో ఉంటే పంటలను విక్రయించే సమయంలో ఎలాంటి సమస్యలు ఉండదని స్పష్టం చేశారు. ఆయా మండలాల రైతులు సంబంధిత ఏఈఓలను కలిసి వివరాలు నమోదు చేసుకోవాలని అని సూచించారు.