పేర్కంపల్లికి గ్రామ సెకట్రరిని నియమించండి
June 16, 2026
dharshininews
పేర్కంపల్లికి గ్రామ సెకట్రరిని నియమించండి
- గ్రామంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేపట్టండి
- యాలాల ఎంపీడీఓను కలిసిన గ్రామ యువకులు
యాలాల, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి పంచాయతీ సెకట్రరీని నియమించాలని ఎంపీడీఓ శ్రీనిజను గ్రామ యువకులు కోరారు.
మంగళవారం గ్రామానికి చెందిన యువకులు హరీష్ గౌడ్, మల్లేష్, నరేష్, వెంకటేష్ తదితరులు ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో కార్యదర్శి లేక గ్రామంలో సమస్యలు పేరుకపోతున్నాయని తెలిపారు.
అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతున్నారని వివరించారు. కావున గ్రామానికి పంచాయతీ కార్యదర్శిని వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు గ్రామంలో సమస్యలను పరిష్కరించి.. గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఇందుకు ఎంపీడీఓ శ్రీనిజ స్పందించి గ్రామానికి పంచాయతీ కార్యదర్శిని త్వరలోనే నియమిస్తామని హామి ఇచ్చినట్లు హరీష్ గౌడ్ తెలిపారు.
https://www.dharshininews.com/43543/