schedule Thursday, September 03, 2026

బుయ్యని.. క్రీడా సేవా స్పూర్తి..!

calendar_today June 10, 2026
person dharshininews
బుయ్యని.. క్రీడా సేవా స్పూర్తి..!
బుయ్యని.. క్రీడా సేవా స్పూర్తి..! - ఇంటర్నేషనల్ క్రీడాకారునికి ఆర్థిక చేయూత - గాజీపూర్ యువకుడికి శ్రీనివాస్‌ రెడ్డి అభినందన - అండగా ఉంటామని భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామీణ ప్రాంత క్రీడాకారుడికి ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూతను అందించి క్రీడాకారుల పట్ల తనకున్న క్రీడా సేవా స్పూర్తిని చాటుకున్నారు. ఎలాంటి సాయమైన అందించేందుకు అండగా ఉంటామని క్రీడాకారునికి భరోసా అందించి ఉత్సహాం నింపారు. వివరాల్లోకి వెళితే..పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన జాతీయ సెయిలింగ్ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్ ఈ నెల 24వ తేదీ నుండి మలేషియాలోని లంఖావిలో నిర్వహించనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. అయితే హర్షవర్ధన్ బెంగళూరులోని ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి 9వ తరగతిలొనే ఎంపికై అక్కడే ఉంటూ గత ఐదు సంవత్సరులుగా సెయిలింగ్ క్రీడలో కోచింగ్ తీసుకుంటూ జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించి ఇండియన్ సెయిలింగ్ అథ్లెట్ గా నిలిచాడు. తండ్రి ఎర్రా చిన్న ఎల్లప్ప(యేసు) రైతు కావడంతో ఆర్ధిక భారంతో పోటీల్లో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గాజీపూర్ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన శ్రీనివాస్ రెడ్డి ఎర్రా హర్షవర్ధన్‌లోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం తన నివాసంలో క్రీడాకారుడు హర్షవర్ధన్ రూ. 1,50,000ల చెక్కు అందించారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హర్షవర్ధన్ మలేషియాలో జరిగే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి గాజీపూర్ గ్రామంతో పాటు తాండూరు ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాజీపూర్ సర్పంచ్ లాల్‌రెడ్డి, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, గ్రామ పెద్దలు ప్రకాష్ రెడ్డి, నసీర్, నర్సిములు,లాలప్ప, భద్రేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, కౌన్సిలర్ జుంటిపల్లి వెంకట్, కాంగ్రేస్ నాయకులు రాజు గౌడ్, సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43492/