schedule Saturday, September 05, 2026

పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయం

calendar_today June 8, 2026
person dharshininews
పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయం
పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయం - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి - ప్రజా సంరక్షణకు ప్రత్యేక దృష్టి - తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య - మున్సిపల్‌లో కొనసాగుతున్న వార్డు సభలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయమని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. ప్రజల సంరక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వార్డు సభలు తాండూరు పట్టణంలో కొనసాగుతున్నాయి. సోమవారం వార్డుల్లో ఏర్పాటు చేసిన సభల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమీషనర్ రాకేష్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, వార్డుల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి ఈ ప్రణాళిక ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే వార్డుల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని అన్నారు. అదేవిధంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల రక్షణకు సంబంధించిన పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఆయా వార్డు సభల్లో కౌన్సిలర్లు, ప్రజలు వార్డు అభివృద్ది, మౌళిక సదుపాయాల కల్పన గురించి విన్నపాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, స్థానిక నాయకులు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43478/