schedule Friday, September 04, 2026

తాండూరులో భారీ వర్షం

calendar_today June 6, 2026
person dharshininews
తాండూరులో భారీ వర్షం
తాండూరులో భారీ వర్షం - డీసీఎంఎస్‌లో తడిసిన ధాన్యం - హైదరాబాద్ రోడ్డు మార్గంలో విరిగిన చెట్లు - పొంగిపొర్లిన మురుగు కాలువలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత వర్షం ప్రారంభమయ్యింది. దాదాపు అరగంట వరకు వర్షం కురిసింది. గాలి వానతో కురిసిన వర్షంతో పట్టణంలోని కాలనీలు తడిసిపోయాయి. ఎదురు గాలులతో పడిన వర్షం వల్ల నేరుగా ఇండ్లలోకి వర్షపు చినుకులు దంచికొట్టాయి. భారీ వర్షంతో పట్టణంలోని మురుగుగ కాలువలు పొంగిపొర్లాయి. రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుకున్నాయి. మరోవైపు భారీ వర్షం వల్ల పట్టణంలోని డీసీఎంఎస్ కేంద్రంలో రైతులు నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. బస్తాలపై ప్లాస్టిక్ కవర్లు, తాడిపత్రిలు కప్పినా లాభం లేకుండా పోయింది. వర్షపు నీరంతా ధాన్యం బస్తాల కిందికి వెళ్లి బస్తాలు తడిసి పోయాయి. దీంతో పాటు భారీ వర్షంతో పాటు గాలి దుమారం వల్ల హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఓ వేప చెట్టు నేలకొరిగింది. ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యయి. వర్షం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం పట్టణానికి వచ్చిన ప్రజలు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని పలు చోట్ల కూడా వర్షం పడింది. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఉపశమనం పొందారు. https://www.dharshininews.com/43458/