schedule Friday, September 04, 2026

మున్సిపల్ కమీషనర్ బదిలీ..!

calendar_today May 31, 2026
person dharshininews
మున్సిపల్ కమీషనర్ బదిలీ..!
మున్సిపల్ కమీషనర్ బదిలీ..! - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - కొత్త కమిషనర్‌ నియామకంపై నోక్లారిటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలో 90 మంది బదిలీల పక్రియను చేపట్టింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు చేసింది. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ కమీషనర్‌ను బదిలీ చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి తాండూరుకు బదిలీపై వచ్చారు. ఆయన పర్యవేక్షణలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అనంతరం పాలకవర్గం కొలువు దీరింది. తాజాగా ఆయనను సైబరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా కమీషనర్‌ను నియమించలేదు. బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరు కమిషనర్లను వేయిటింగ్‌లో ఉంచారు. కాని తాండూరు మున్సిపల్ కమీషనర్‌ నియామకంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. https://www.dharshininews.com/43411/