schedule Friday, September 04, 2026

సంబరంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం

calendar_today May 29, 2026
person dharshininews
సంబరంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం
సంబరంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం - ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, పండ్ల పంపిణీ - పాల్గొన్న చైర్ పర్సన్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుమారుడు బుయ్యని శివకుమార్‌ రెడ్డి జన్మదిన వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, పార్టీ నాయకులు హాజరయ్యారు. శివకుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుమారుడుగా శివకుమార్‌ రెడ్డి ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తరహాలో అన్ని రంగాల్లో తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. శివకుమార్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మమత, బోయరవి, వెంకన్న గౌడ్, కౌన్సిలర్ బంటు వేణుగోపాల్, సత్యమూర్తి దొరశెట్టి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుపాకుల అనిల్, మడపతి శివకుమార్, కిష్టప్ప, ఉదయ్ భాస్కర్, కొమ్ము గోపాల్ రెడ్డి, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43405/