schedule Saturday, September 05, 2026

కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు

calendar_today May 26, 2026
person dharshininews
కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు
కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు - మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు - బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఇబ్రహీం తాండూరు, దర్శిని ప్రతినిధి : కేటీఆర్‌ గురించి వాఖ్యలు చేసే అర్హత తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ యువనాయకులు ఇబ్రహీం అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్‌ విషయంలో కేటీఆర్ వాఖ్యలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్‌ రాజకీయాలు చేయడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే స్థాయి వాళ్లకు లేదని అన్నారు. పదే పదే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థాయి మరిచి రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే మీ జాతకాలన్ని ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చడానికి ప్రయత్నించాలని హితవు పలికారు. https://www.dharshininews.com/43377/