schedule Friday, September 04, 2026

మద్యం విక్రయాలు జరపొద్దు..!

calendar_today May 16, 2026
person dharshininews
మద్యం విక్రయాలు జరపొద్దు..!
మద్యం విక్రయాలు జరపొద్దు..! - రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో నిషేధం - తీర్మానం చేసినా కౌన్సిలర్ జావిద్ - పలు దుకాణదారులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమంగా మద్యం నిల్వలు ఉంచుకొని విక్రయాలు జరపరాదని తాండూరు పట్టణం 8వ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు. తన వార్డులో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. శనివారం వార్డులోని రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనిలో కిరాణా దుకాణాలు, వివిధ వ్యాపారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. ఆరోపణలు ఉన్న బెల్టు షాపుల వద్దకు వెళ్లి తీర్మాన పత్రాలను అందజేశారు. కాలనీలో దుకాణాల్లో ఎవరూ మధ్య విక్రయాలు చేపట్టరాదని తెలిపారు. కాలనీలో మద్యం నిషేధం తీర్మానం చేయడం జరిగిందని వివరించారు. మద్యం విక్రయాల వల్ల కుటుంబాలు రోడ్డుపాలు అయ్యే ప్రమాదం ఉందని, యువత కూడా బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా మద్యం విక్రయానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మద్య నిషేధానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.   https://www.dharshininews.com/43324/