చార్జర్, నీళ్లు కావాలని వచ్చి..!
May 15, 2026
dharshininews
చార్జర్, నీళ్లు కావాలని వచ్చి..!
- మైనర్ బాలికపై అఘాయిత్యం
- ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో ఎవరు లేని సమయంలో చార్జర్, నీళ్లు కావాలని వచ్చి ఓ యువకుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటన యాలాల మండలంలో జరిగింది. పోలీసులు నిందితుడిపై ఫోక్సో, రేప్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరిలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన షేక్ ఫరాన్(18) అనే యువకుడు అదే గ్రామంలో ఇంటిపక్కన ఉండే వారింట్లో ఎవరు లేని సమయంలో చార్జర్, నీళ్లు కావాలంటూ వెళ్లాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న 14ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన కుటుంభీకులు యాలాల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు, రేప్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు యాలాల పోలీసులు తెలిపారు. యాలాల మండలంలో ఈ కేసు సంచలనంగా మారడంతో పాటు చర్చనీయాంశమైంది.
https://www.dharshininews.com/43317/