schedule Saturday, September 05, 2026

యువ నాయకుడికే పగ్గాలు

calendar_today May 5, 2026
person dharshininews
యువ నాయకుడికే పగ్గాలు
యువ నాయకుడికే పగ్గాలు - కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా రోయ్యల నాగరాజు - టీపీసీసీ అధ్యక్షుడికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా రోయ్యల నాగరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయన నియామకంను ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ తమ పై నమ్మకంతో అధ్యక్ష పదవులను అప్పగించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని అన్నారు. పార్టీలోని సీనీయర్ నాయకులు, యువ నాయకుల అందరి సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. https://www.dharshininews.com/43213/