schedule Friday, September 04, 2026

హిందూవులందరు తరలిరండి..!

calendar_today April 18, 2026
person dharshininews
హిందూవులందరు తరలిరండి..!
హిందూవులందరు తరలిరండి..! - రేపు తాండూరులో హిందూ సమ్మేళనం - ఏర్పాట్లు చేసిన ఉత్సవ సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధర్మం, సమాజం కోసం కృషి చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్‌) వందేళ్ల ఉత్సవాలను హిందూ సమ్మేళన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఆదివారం తాండూరు పట్టణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాండూరు పట్టణం మల్‌ రెడ్డిపల్లిలోని హనుమాన్‌ ఫంక్షన్‌ వెనుకా ఉన్న ఇండోర్ క్రికెట్ గ్రౌండ్‌లో సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ సాధు పరిషత్ మార్గదర్శక మండలి సభ్యులు సంత్‌ శ్రీ సంగ్రామ్ మమరాజ్, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాననీయ లింగం శ్రీధర్, దుర్గ వాహిని ప్రాంత సంయోజక్‌ వాణి సక్కుబాయిలు హాజరవుతున్నట్లు సమితి అధ్యక్షులు మేడిశెట్టి చంద్రకళ జగన్నాథం తెలిపారు. ఈ సమ్మేళానికి హిందూవులు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/43132/