schedule Saturday, September 05, 2026

జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ రాజీనామా

calendar_today April 17, 2026
person dharshininews
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ రాజీనామా
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ రాజీనామా - విధుల నుంచి తప్పుకున్న డా.వినయ్‌ కుమార్ - నిర్ణయానికి గల కారణాలు లేఖలో వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.వినయ్ కుమార్ రాజీనామా చేశారు. విధుల నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామ లేఖలో కారణాలను వెల్లడించారు. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆసుపత్రిలో నిర్వహణ, పర్యవేక్షణ కోసం కొందరు వైద్యులు సహాకారం అందించడం లేదని లేఖలో పేర్కొనడం గమనార్హం. వైద్యులతో పాటు సిబ్బంది కూడా మాట వినడం లేదని చెప్పడం చర్చనీయాశంగా మారింది. ఈ కారణంగానే తాను విధుల నుంచి తప్పుకుంటున్నట్లు, రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. గతంలో కూడా సూపరిండెంట్ డా. వినయ్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తాండూరు ఎమ్మెల్యే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా డా. వినయ్ కుమార్ సూపరిండెంట్‌గా రాజీనామా చేయడం చర్చనీయాశంగా మారింది. https://www.dharshininews.com/43110/