schedule Friday, September 04, 2026

శభాష్.. మోయిజ్..!

calendar_today April 13, 2026
person dharshininews
శభాష్.. మోయిజ్..!
శభాష్.. మోయిజ్..! - గోల్డ్ మెడల్ క్రీడాకారునికి అభినందనలు - సన్మానించిన ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సోసైటి  తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ట్రక్ డ్రైవర్ కుమారుడు మోయిజ్‌ను శభాష్‌ అంటూ ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సోసైటి సభ్యులు అభినందించారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మోయిజ్ ఇటీవల నేపాల్ రాష్ట్రం ఖాట్మండులో జరిగిన షూటింగ్‌ బాల్‌ టోర్నమెంట్ జాతీయ పోటీలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. ఇందులో భాగంగా సోమవారం తాండూరు ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సోసైటి ఆధ్వర్యంలో మోయిజ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోసైటి అధ్యక్షులు కమల్‌ అతహర్ మాట్లాడుతూ తాండూరుకు జాతీయ స్థాయిలో మోయిజ్‌ గోల్డ్ మెడల్‌ సాధించి తీసుకరావడం గర్వకారణమని అన్నారు. పేదరికాన్ని లెక్కచేయకుండా.. ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. మోయిజ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సోసైటి కార్యదర్శి మహమ్మద్ యూనుస్, అబ్దుల్ ఖవి, అబ్దుల్‌ లతీఫ్, అబ్దుల్ హమీద్, అసద్ అలీ, మహమ్మద్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43058/