schedule Friday, September 04, 2026

చెవుడు, మూగ సమస్యలకు చెక్..!

calendar_today April 7, 2026
person dharshininews
చెవుడు, మూగ సమస్యలకు చెక్..!
చెవుడు, మూగ సమస్యలకు చెక్..! - తాండూరులో ప్రత్యేక వైద్య సేవలు - మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం - ఆడియాలజిస్ట్ డా.చంద్రశేఖర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చెవుడు(వినికిడి లోపం), మూగ సమస్యలతో బాధపడేవారికి ఇది శుభవార్త. తాండూరులో ప్రత్యేక వైద్య సేవలు అందించే హియరింగ్‌ అండ్‌ స్పీప్ థెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఆడియాలిజిస్ట్ డా.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ఇందిరా చౌక్ సమీపంలో వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో వినికిడి సమస్యలు, మూగ సమస్యలు ఉన్న వారికి ఆ సమస్యలు తొలగే సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ వినికిడి సమస్యలు, మాటలు సరిగ్గా రావడం, మరియు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి తగిన చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వివరించారు. ఈ కేంద్రంలో అధునాతన పరికరాలతో వినికిడి పరీక్షలు, స్పీచ్ థెరపీ, మరియు ఇతర సంబంధిత సేవలు అందించబడుతాయని వారు తెలిపారు. తాండూరు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://www.dharshininews.com/42984/