schedule Friday, September 04, 2026

బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం

calendar_today April 6, 2026
person dharshininews
బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం
బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నాగారం మల్లేశం - నియామకం చేసిన పార్టీ జిల్లా కన్వీనర్ - అభినందనలు తెలిపిన సీనియర్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహల్లాద రావు నియామక పత్రం అందజేశారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియామకమైన నాగారం మల్లేశంను జిల్లా సీనియర్ నాయకులు మనోహర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్ కుమార్ లు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ గా నియమకమైన నాగారం మల్లేశం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియామకమైన నాగారం మల్లేశంకు ఆ పార్టీ కౌన్సిలర్లు అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డి లతోపాటు పార్టీ నాయకులు చిదిరి ప్రకాష్, మంతటి రాజు, చాకలి బిచ్చప్ప, ప్రభాకర్ గౌడ్, బబ్లు, సాయిలు, బసవరాజు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగారం మల్లేశం మాట్లాడుతూ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. https://www.dharshininews.com/42967/