షబ్బాష్.. మోయిజ్..!
April 4, 2026
dharshininews
షబ్బాష్.. మోయిజ్..!
- జాతీయ స్థాయి షూటింగ్ బాల్ సీరీస్‌కు సిద్దం
- ఇండియా తరుపున నేపాల్ టోర్నమెంట్‌కు ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన మోయిజ్ అనే యువకుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
షూటింగ్ బాల్ పోటీలో సత్తా చాటిన మోయిజ్ జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో ఇండియా తరుపున పోటికి సిద్దమయ్యాడు. ఈనెల 7, 9వ తేదిలలో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగే షూటింగ్ బాల్ సీరీస్-2026 పోటీలలో భారత దేశం నుంచి పాల్గొంటున్నాడు. తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన మోయిజ్ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
పేదరికంలో ఉండి ఇంటర్ పూర్తి చేసిన మోయిజ్ లాబ్ టెక్నీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు. షూటింగ్ బాల్ క్రీడల్లో ప్రావిణ్యం పొంది అంచలంచెలుగా ఎదుగుతు భారత దేశం తరుపున జాతీయ స్తాయి పోటీలో పాల్గొంటున్న మోయిజ్‌ను షబ్బాష్.. అంటూ అభినందిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలో కూడా సత్తా చాటాలని ప్రోత్సహిస్తున్నారు. తాండూరుకు చెందిన రాము శిక్షణలో మోయిజ్ రాణిస్తున్నాడు.
https://www.dharshininews.com/42946/