schedule Saturday, September 05, 2026

అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్‌ పంజా

calendar_today March 24, 2026
person dharshininews
అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్‌ పంజా
అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్‌ పంజా - యాలాలలో 8 ఇసుక ట్రాక్టర్ల సీజ్ - కరణ్‌ కోట్‌లో కలప లారీ పట్టివేత - వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ రవాణాపై వికారాబాద్‌ జిల్లా టాస్క్ ఫోర్స్ పంజా విసురుతోంది. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తూ అక్రవా రవాణాకు కళ్లెం వేస్తోంది. తాజాగా యాలాల మండలంలో మెరుపు దాడులు నిర్వహించింది. మండలంలో నది ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్పీ స్నేహా మెహ్రా ఓ ప్రకటనలో వెల్లడించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ పట్టుకుని సీజ్ చేసిందని తెలిపారు. అదేవిధంగా తాండూరు సబ్ డివిజన్ కరణ్‌ కోట్ పోలీస్టేషన్ పరిధిలో అక్రమంగా కలప తరలిస్తున్న లారీని కూడా టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఈ మేరకు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసిటనట్లు తెలిసింది. అదేవిధంగా జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందం సమర్థవంతంగా పనిచేస్తోందని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జనవరిలో 22 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసుల, మార్చిలో 20 కేసులు మొత్తం 51 అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ స్నేహా మెహ్రా ప్రకటించారు. జిల్లాలో అక్రమ రవాణాను నియంత్రించేందుకు కఠినంగా వ్యవహరించడం జరగుతుందని పేర్కొన్నారు. అక్రమ రవాణాలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. https://www.dharshininews.com/42769/