schedule Saturday, September 05, 2026

నిరంజన్ గౌడ్‌కు నివాళులు..!

calendar_today March 22, 2026
person dharshininews
నిరంజన్ గౌడ్‌కు నివాళులు..!
నిరంజన్ గౌడ్‌కు నివాళులు..! - వర్దంతిలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన రాజకీయ నాయకులు స్వర్గీయ నిరంజన్‌ గౌడ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రార్ధించారు. ఆదివారం తాండూరు పట్టణంలో నిరంజన్‌ గౌడ్ వర్దంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డా. సంపత్ కుమార్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్‌తో పాటు పలువురు నాయకులు నిరంజన్‌ గౌడ్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నిరంజన్ గౌడ్ మృతి బాధాకరమని ఆయన లేని లోటు తీరనిది అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, రమేష్, హరి గౌడ్, చింటూ, కిషోర్, మన్నారెడ్డి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42700/