schedule Saturday, September 05, 2026

శభాష్‌.. దివిటి ఎల్లప్ప..!

calendar_today March 15, 2026
person dharshininews
శభాష్‌.. దివిటి ఎల్లప్ప..!
శభాష్‌.. దివిటి ఎల్లప్ప..! - వార్డులో నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి - దగ్గరుండి బోరుకు మరమ్మత్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో అదిచేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పడం కాదు గెలిచిన తరువాత ప్రజల కష్టాలు తీర్చినప్పుడే మంచి నాయకుడుగా గుర్తింపు వస్తుంది. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప అదే బాటలో నడుతుస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం రావడంతో వార్డులోని అంబేద్కర్ నగర్‌ తాగునీటి ఎద్దడి ఏర్పడింది. కొన్నిరోజులుగా వార్డు ప్రజలు నీటికష్టాలను ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కోసం దివిటి ఎల్లప్ప మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. ఆమె సహాకారంతో ఆదివారం అంబేద్కర్ నగర్‌లో బోరు మోటార్ మరమ్మత్తులు చేయించారు. దగ్గరుండి బోరుకు చేసింగ్ చేయించారు. బోరులో నీటి లభ్యత సామర్థ్యాన్ని పెంచేలా చొరవ చూపించారు. ఈ సందర్భంగా దివిటి ఎల్లప్ప మాట్లాడుతూ ప్రజల నీటికష్టాలు తీర్చడంకోసం బాధ్యత తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు చైర్ పర్సన్ సహకారంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వార్డులో నీటి కష్టాలను తీర్చేందుకు దివిటి ఎల్లప్ప చేస్తున్న కృషిని శభాష్ అంటూ పలువురు అభినందించారు. https://www.dharshininews.com/42571/