schedule Sunday, September 06, 2026

పండగలా బుయ్యని శ్రీనన్న జన్మదినం

calendar_today March 10, 2026
person dharshininews
పండగలా బుయ్యని శ్రీనన్న జన్మదినం
పండగలా బుయ్యని శ్రీనన్న జన్మదినం - వెల్లువలా ఆప్తులు, అభిమానుల శుభాకాంక్షలు - శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పండగలా జరిగాయి. మంగళవారం అర్దరాత్రి నుంచే వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జన్మదిన వేడుకల హాంగామా ఆర్దరాత్రి నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వరకు కనిపించింది. తాండూరు నియోజకవర్గంతో పాటు పరిగి ప్రాంతానికి చెందిన ఆప్తులు, అభిమానులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి కల్వ రాధాకృష్ణ, సీనీయర్ జర్నలిస్టు శెట్టి రవి శంకర్, టీజేఎస్ నాయకులు సోమశేఖర్ తదితరులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు, యువకులు, అభిమానులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ను అర్దరాత్రి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి, ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులను గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. https://www.dharshininews.com/42389/