schedule Saturday, September 05, 2026

ఎమ్మెల్యేతో బీజేపీ కౌన్సిలర్ల భేటీ..!

calendar_today March 10, 2026
person dharshininews
ఎమ్మెల్యేతో బీజేపీ కౌన్సిలర్ల భేటీ..!
ఎమ్మెల్యేతో బీజేపీ కౌన్సిలర్ల భేటీ..! - తమ వార్డుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి - ఇతర అంశాలపై త్రిమూర్తుల చర్చలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు భేటి అయ్యారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆయన నివాసంలో బీజేపీ కౌన్సిలర్లు నాగారం మల్లేశం, అంతారం కిరణ్‌ కుమార్, శ్రీకాంత్‌ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేతో పలు విషయాలపై చర్చించారు. తాండూరు పట్టణంలోని తమ వార్డుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు రోడ్లు, డ్రైన్లు వంటి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు కౌన్సిలర్ నాగారం మల్లేశం తెలిపారు. https://www.dharshininews.com/42378/