schedule Saturday, September 05, 2026

అయ్యో.. అవ్వా..!

calendar_today March 8, 2026
person dharshininews
అయ్యో.. అవ్వా..!
అయ్యో.. అవ్వా..! - ఎండలోనే నీరసించి పోయిన వృద్ధురాలు - గుర్తుతెలియని వృద్ధురాలిపై స్థానికుల సానుభూతి - తాండూరు పట్టణ శివారులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ముందే ఎండలు మండుతున్నాయి. ఈ వేసవి కాలంలో చిన్నారులు, వృద్ధులు ఎంతో జాగ్రత్త ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే తాండూరులో ఓ ముసలవ్వ ఉదయం నుంచే ఎండలో ఉండిపోయింది. సాయంత్రం సరికి నీరసించి పడిపోయింది. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణ శివారులో కనిపించింది. తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని కోట్‌పల్లి రోడ్డు మార్గంలో ఉన్న పెట్రోల్ పంపు వద్దకు గుర్తుతెలియని వృద్ధురాలు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లాలో తెలియలేక చేతకాక నడవలేక అక్కడే ఉండిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం.. రాత్రి వరకు అక్కడే ఉండిపోయింది. ఆమె వివరాలు తెలియరాలేదు. ఎండ వల్ల తీవ్రంగా నీరసించి కనిపిస్తోంది. స్థానికులు ఆమెను గమనించి సోషల్ మీడియాకు ఫోటోలు అందించారు. వృద్దులురాలు చూసి అయ్యో అవ్వా అంటూ సానుభూతి తెలిపారు. ఈ వృద్ధురాలు గురించి తెలిస్తే అంతారం - కోట్‌పల్లి రోడ్డు మార్గంలో ఉన్న పెట్రోల్ పంపు వద్దకు రావాలని స్థానింకులు కోరుతున్నారు. https://www.dharshininews.com/42335/