schedule Saturday, September 05, 2026

గాంధీ నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

calendar_today March 8, 2026
person dharshininews
గాంధీ నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
గాంధీ నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవం - మహిళ మణులను సన్మానించిన కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్‌ - కౌన్సిలర్‌ను కూడా సన్మానించిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 20వ వార్డు గాంధీనగర్‌లో అంతర్జాతీయ మహిళ దినొత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం వార్డు కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నవీన సంతోష్‌ గౌడ్ వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న టీచర్స్, సోషల్ వర్కర్స్, వార్డు ఆర్పీలు, ఏఓపీపీలు, ప్రజా ప్రతినిధులను సన్మానించారు. అనంతరం కౌన్సిలర్‌గా ఎన్నికైన నవీన సంతోష్‌ గౌడ్‌ను కూడా స్థానికులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కౌన్సిలర్‌ నవీన సంతోష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42330/