schedule Sunday, September 06, 2026

తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత

calendar_today March 7, 2026
person dharshininews
తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత
తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత - నియామకం, బాధ్యతల స్వీకరణ - సబ్‌ కార్యాలయంలో మార్పు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన సబ్‌ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ బదీలీల ప్రక్రియలో భాగంగా వికారాబాద్‌ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా నియామకమైన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీగా ఉన్న పోస్టును ప్రభుత్వం ఆదేశాల మేరకు భర్తి చేశారు. అయితే ఐఏఎస్ హోదాలో ఉమా శంకర్‌ ప్రసాద్ పనిచేయడంతో సబ్‌ కలెక్టర్ కార్యాలయంగా ఉండేది. తాజాగా ఆయన బదిలీ కావడంతో సబ్‌ కలెక్టర్ కార్యాలయాన్ని రెవెన్యూ కార్యాలయంగా మార్చినట్లు సమాచారం. దీంతో తాండూరు నూతన ఆర్డీవో గా కర్ర అనితను నియమించినట్లు తెలుస్తోంది. శనివారం ఆర్డీఓగా కర్ర అనిత బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అధికారులు ఆమెకు మొక్కను బహుకరించి స్వాగతం పలికారు. కర్ర అనిత ఇదివరకు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ల్యాండ్ ప్రొటెక్షన్ సేల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి తాండూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ప్రభుత్వం ఆమెను నియమించింది. https://www.dharshininews.com/42294/