schedule Sunday, September 06, 2026

ఐలాండ్‌పై స్పెషల్ ఫోకస్..!

calendar_today March 7, 2026
person dharshininews
ఐలాండ్‌పై స్పెషల్ ఫోకస్..!
ఐలాండ్‌పై స్పెషల్ ఫోకస్..! - సుందరంగా మార్చేందుకు చర్యలు - ఆదేశించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున ఇందిరా చౌరస్తాలో ఉన్న ఐలాండ్‌ను అందంగా మార్చేందుకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. శనివారం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న ఐలాండ్‌ను పరిశీలించారు. కమీషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఐలాండ్ పరిసరాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఐలాండ్‌ ప్రాంతాన్ని పరిశుభ్రపరించేందుకు ఆదేశించారు. పరిశుభ్రం పరిచిన తరువాత రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. https://www.dharshininews.com/42288/