schedule Saturday, September 05, 2026

ఉద్యమ కారులకు ఇళ్లు, ఫించన్‌ ఇవ్వాలి

calendar_today March 2, 2026
person dharshininews
ఉద్యమ కారులకు ఇళ్లు, ఫించన్‌ ఇవ్వాలి
ఉద్యమ కారులకు ఇళ్లు, ఫించన్‌ ఇవ్వాలి - గుర్తింపు కార్డుతో పాటు పథకాలు అమలు చేయాలి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని తెలంగాణ ఉద్యమ కారులకు ఇళ్ల స్థలాలు, ఫించన్‌తో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకావులకు 250 గజాల ఇంటి స్థలాలు, పింఛన్‌తో పాటు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని కోరారు. గతనెల 23న హైకోర్టు కూడా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఫించన్‌, గుర్తింపు కార్డులను ఎనిమిది వారాల్లోగా ఇవ్వాలని ఆదేశం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇందుకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ.. అర్హులైన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ఫెరోజ్ ఖాన్, జిలాని, కేశవులు, వాజిద్ మియా, ప్రకాష్ గౌడ్, మల్లేష్, కాసిం పాషా, వీరమణి, నూరుద్దీన్, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బంటారం బద్రేశ్వర్, సువర్ణ, నరేష్, రాథోడ్, బాబా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42238/