schedule Saturday, September 05, 2026

రేపే హోలీ హాలిడే..!

calendar_today March 2, 2026
person dharshininews
రేపే హోలీ హాలిడే..!
రేపే హోలీ హాలిడే..! - ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ - 4న పండగ జరుపుకోవాలని నిర్ణయం - అయోమయంలో టీచర్లు, ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో హోలీ హాలిడేను ప్రకటించారు. రేపు మంగళవారం సెలవు దినంగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్ర గ్రహణం కారణంగా హోలీ పండగ నిర్వహణపై సందిగ్దత ఏర్పడింది. 3వ తేదిన చంద్రగ్రహణం ఉండడంతో 2వ తేదిన కామన దహనం జరుపుకోవాలని, 4వ తేదిన హోలీ పండగను జరుపుకోవాలని పండితులు, హిందూ ఉత్సవ సంఘాలు నిర్ణయించారు. ప్రభుత్వం మాత్రం రేపు 3న హోలీ పండగ సెలవును ప్రకటించింది. 4వ తేదిన పనిదినంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు అయోమానికి గురవుతున్నారు. https://www.dharshininews.com/42234/