schedule Saturday, September 05, 2026

అట్టహాసంగా పట్లోళ్ల పదవి బాధ్యతల స్వీకరణ

calendar_today March 2, 2026
person dharshininews
అట్టహాసంగా పట్లోళ్ల పదవి బాధ్యతల స్వీకరణ
అట్టహాసంగా పట్లోళ్ల పదవి బాధ్యతల స్వీకరణ - హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డికి అభినందనల వెల్లువ - అబ్దుల్‌ రజాక్‌కు పలువురి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ అట్టహాసంగా జరిగింది. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ చాంబర్‌లో పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులు వేదపండితుల మంత్రోచ్చరణల మద్య పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్ పర్సన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అదేవిధంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లకు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు నేతలు, మాజీ కౌన్సిలర్లు అధికారులు శుభాకాంక్షులు తెలిపారు. శాలువాలు, పూలమాలలో సత్కరించి అభినందనలు తెలిపారు. నేతలు, కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం సందడిగా మారింది. https://www.dharshininews.com/42231/