schedule Sunday, September 06, 2026

విద్యార్థుల తడబాటు..!

calendar_today February 25, 2026
person dharshininews
విద్యార్థుల తడబాటు..!
విద్యార్థుల తడబాటు..! - పోరపాటున తప్పుడు పరీక్షా కేంద్రానికి - సాయం అందించిన పోలీస్ కానిస్టేబుల్‌ - మరో ఇద్దరికి హెల్ప్ చేసిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థలు తొలి రోజు తడబాటుకు గురయ్యారు. ఓ ముగ్గురు విద్యార్థులు హాడావుడిలో పోరపాటున తప్పుడు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. అక్కడే విధుల్లో  ఉన్న కానిస్టేబుల్ బలరాం, మరో వ్యక్తి వారిని బైకుపై ఎక్కించుకుని వారికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి తరలించారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు పరీక్షలు జరుగుతుండగా అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మైనార్టీ గురుకుల కాలేజీతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని సోషల్ వెల్పేర్ కాలేజీలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మైనార్టీ గురుకుల కాలేజీ వద్దకు ముగ్గురు విద్యార్థినిలు వచ్చారు. అయితే వారి హాల్‌ టిక్కెట్‌ పై సోషల్ వెల్పేర్ కాలేజీ సెంటర్ పేరు ఉంది. అప్పటికే సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ విద్యార్థిలను బైకుపై సోషల్ వెల్పేర్ కాలేజీ సెంటర్‌కు తీసుకవెళ్లి సాయం అందించారు. మరో ఇద్దరిని స్థానికులు కూడా బైకుపై తీసుకవెళ్లి పరీక్షా కేంద్రం వద్ద దిగబెట్టారు. దీంతో విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. https://www.dharshininews.com/42116/