schedule Thursday, September 03, 2026

సైన్స్ ఫేయిర్లో 'టాలెంట్' అదుర్స్..!

calendar_today January 6, 2026
person dharshininews
సైన్స్ ఫేయిర్లో 'టాలెంట్' అదుర్స్..!
సైన్స్ ఫేయిర్లో 'టాలెంట్' అదుర్స్..! - జిల్లా స్థాయిలో ఎస్కేటీఎస్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్ - అభినందించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేయిర్లో తాండూరులో శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి అదుర్స్ అనిపించాడు. జిల్లా స్థాయిలో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించి ఆకట్టుకున్నాడు. మంగళవారం పరిగిలో వికారాబాద్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి జి. సుధీక్షిత్ రెడ్డి పాల్గొని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రదర్శించాడు. ఈ సైన్స్ ఫేయిర్ లో ఈ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. జిల్లా స్థాయిలో ఈ ప్రదర్శనకు మొదటి బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. చేతుల మీదుగా ప్రశంస పత్రం, బహుమతి అందుకున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి సైన్స్ ఫేయిర్లో సత్తా చాటిన విద్యార్థి సుధీక్షిత్ రెడ్డిని పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణు వర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పి.సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ జయవర్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ రమేష్, సిబ్బంది, యజమాన్యం అభినందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40438/