చెట్టు కొమ్మ.. ఎంతపని చేసిందమ్మా..!
September 18, 2025
dharshininews
చెట్టు కొమ్మ.. ఎంతపని చేసిందమ్మా..!
- తలపై పడడంతో విద్యార్థికి గాయాలు
- బసీరాబాద్ మండల కేంద్రంలో ఘటన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అటలాడేందుకు వచ్చిన ఓ విద్యార్థిపై అకస్మాత్తుగా చెట్టు కొమ్మ విరిగి పడింది. తలకు గాయాలై.. ఆసుపత్రి పాలయ్యాడు.
ఈ సంఘటన గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఎస్‌జీఎఫ్ కింద క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తాండూరు పట్టణం వాల్మీకీ నగర్‌కు చెందిన సుశాంత్ అనే విద్యార్థి తాండూరు మండలం జినుగుర్తి మోడల్ స్కూల్ తరపున క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాడు. తోటి స్నేహితులతో కలిసి పాఠశాల మైదానంలో ఉన్న రావి చెట్టు కింద నిలుచున్నాడు.
అంతలోనే అకస్మాత్తుగా చెట్టుకొమ్మ విరిగి విద్యార్థి తలపై పడింది. దీంతో విద్యార్థి తీవ్రగాయాలపాలయ్యాడు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. వైద్యుల సూచన మేరకు విద్యార్థిని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/38657/