schedule Tuesday, September 08, 2026

అనుతులు ఉంటేనే రవాణా..!

calendar_today May 27, 2025
person dharshininews
అనుతులు ఉంటేనే రవాణా..!
అనుతులు ఉంటేనే రవాణా..! - ఆవులు, లేగ దూడల తరలింపుపై నిఘా - అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వాలి - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బక్రీద్ సందర్భంగా ఎవరైనా ఆవులు, లేగ దూడలను తరలించాలన్నా, విక్రయించాలన్నా అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం డీఎస్పీ మీడీయాతో మాట్లాడారు. వచ్చేనెల 7న జరిగే బక్రీద్ పండగ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆవులు, లేగ దూడల అక్రమ రవాణాపై దృష్టిసారిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఆవులు, దూడలను తరలించే వారు అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా విక్రయించే వారు, కొనుగోలు దారులు కూడా సంబందిత శాఖ అధికారుల నుంచి దృవ పత్రాలను పొందాలన్నారు. మరోవైపు గోవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే గోరక్షకులు గాని గో స్వయం సేవక సంఘాల ప్రతినిధులు డయల్ 100 గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు. నేరుగా అడ్డుకుని దాడులకు పాల్పడడం పద్దతి కాదన్నారు. బక్రీద్ రోజున వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా మున్సిపల్ అధికారులు అందించే బస్తాలలో అందించాలని సూచించారు. బక్రీద్ పండగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అందరు సహకరించాలని విజ్ఞఫ్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35800/