schedule Thursday, September 03, 2026

పెద్దేముల్ ఎస్ఐగా విశ్వ‌జాన్..!

calendar_today August 16, 2021
person dharshininews
పెద్దేముల్ ఎస్ఐగా విశ్వ‌జాన్..!
- నేడు సాయంత్రం బాధ్య‌త‌లు ద‌ర్శిని ప్ర‌తినిధి, తాండూరు : తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దేముల్ ఎస్ఐగా విశ్వ‌జాన్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. పెద్దేముల్ ఎస్ఐగా ప‌నిచేసిన చంద్ర‌శేఖ‌ర్ ఇసుక ట్రాక్ట‌ర్ల విష‌యంలో లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. దీంతో అధికారుల‌ను చంద్ర‌శేఖ‌ర్‌ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. ప్ర‌స్తుతం పెద్దేముల్ ఇంచార్జ్ ఎస్ఐగా గ‌ఫ్పార్ కొన‌సాగుతున్నారు. పూర్తిస్థాయి ఎస్ఐగా విశ్వ‌జాన్ బాధ్య‌త‌లు చేపట్ట‌బోతున్నారు. విశ్వ‌జాన్ కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని దౌల్తాబాద్ ఎస్ఐగా విధులు నిర్వ‌హిస్తున్నారు. అక్క‌డి నుంచి ఆయ‌న పెద్దేముల్ ఎస్ఐగా రాబోతున్నారు.