schedule Saturday, July 04, 2026

డబ్బుల దండ లాగేసిన దొంగ..!

calendar_today November 25, 2024
person dharshininews
డబ్బుల దండ లాగేసిన దొంగ..!
డబ్బుల దండ లాగేసిన దొంగ..! - పెళ్లి దుస్తుల్లోనే వెంబడించిన వరుడు - సోషల్ మీడియాలో వైరల్ అయిన చేజింగ్ దర్శిని డెస్క్ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లోని దంగర్వాలీలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహ వేడుకలో వరుడి మెడలో ఉన్న దండలోంచి కరెన్సీ నోట్లను దొంగిలించాడు. దీంతో వరుడు దొంగను వెంబడించి పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈసంఘటన ఈనెల 23న జరిగింది. వరుడు గుర్రపు స్వారీ చేసుకుంటూ కుటుంబ సమేతంగా గుడికి వెళ్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి పెళ్లికొడుకు మెడలోని నోట్ల దండలో నుంచి ఒకనోటు తీసుకుని పారిపోయాడు. దీంతో షాకైన వరుడు.. వెంటనే పెళ్లి వేడుకను వదిలి పారిపోతున్న యువకుడిని వెంటాడాడు. గుర్రం దిగి ఓ బైకుపై వాహనాన్ని వెంబడించాడు. వాహనం డోర్‌కు వేలాడుతూ, వాహనాన్ని ఆపమని పదేపదే కోరారు. అపకపోవడంతో డోర్‌లో నుంచి వాహనంలోకి దూకి దొంగను పట్టుకున్నాడు. ఇంతలో వరుడి కుటుంబీకులు కూడా అక్కడికి చేరుకుని వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనం ఆపిన తర్వాత పెళ్లికొడుకు, అతని కుటుంబ సభ్యులు దొంగను పట్టుకున్నారు. ఆగ్రహంతో యువకుడిని, డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఒక్క నోటు కోసం ఇంత పెద్ద గొడవ జరుగుతుందని తనకు తెలియదని ఆ యువకుడు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత వరుడి కుటుంబీకులు అతడిని క్షమించి వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన అక్కడున్నవారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడి ధైర్యసాహసాలు, జనాల నవ్వు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన పెళ్లికొడుకు ధైర్యసాహసాలను చాటిచెప్పడం చర్చనీయాంశంగా మారింది. https://x.com/i/status/1860773014503043497 ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/30815/