schedule Thursday, September 10, 2026

విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి

calendar_today November 5, 2024
person dharshininews
విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి - తాండూరు బజరంగ్‌దళ్ డిమాండ్ - పట్టణ పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తాండూరు బజరంగ్‌దళ్‌ సభ్యులు డిమాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌ ఫోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో గల నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై మంగళవారం బజరంగ్‌దళ్‌ సభ్యులు స్పందించారు. తాండూరు పట్టణ పోలీస్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులకు వినతిపత్రం అందజేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బజరంగ్‌దళ్ సభ్యులు మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై గత 20 రోజుల నుండి జరుగుతున్నా దాడులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం లో హిందూ ఆలయాలపై జరిగే దాడులను ఆపేందుకు ప్రతి హిందువు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల వ్యవహారిస్తున్న మొండి వ్యాఖరి ని మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని అగ్రహించారు. హిందువుల జోలికి, హిందూ ఆలయాల జోలికి వస్తే ఖాబర్దార్ అని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30372/