schedule Thursday, September 03, 2026

మల్లారెడ్డా.. మజాకా..!

calendar_today October 21, 2024
person dharshininews
మల్లారెడ్డా.. మజాకా..!
మల్లారెడ్డా.. మజాకా..! - మనవరాలి సంగీత్‌లో డ్యాన్స్‌ - అదరగొట్టే స్టెప్పులకు అందరు ఫిదా హైదరాబాద్, దర్శిని ప్రతినిది : పాలమ్మినా.. పూలమ్మినా.. అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన సందడి ఇప్పటికి ఎవ్వరు మరిచిపోలేరు. తాజాగా మరోసారి మల్లారెడ్డి వైరల్‌ అయ్యారు. మల్లారెడ్డా.. మజాకా అని పించుకున్నారు. తనలోని జోష్ ఏంటో మరోసారి చూపించారు. చామకూర మల్లారెడ్డి మనమరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి కూతురి వివారం ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మల్లారెడ్డి మనమరాలి సంగీత్‌ ఫంక్షన్‌ అట్టహాసంగా జరిగింది. ఈ సంగీత్‌లో మల్లారెడ్డి ఫుల్‌ ఎంజాయ్‌ చేసేశారు. డీజే టిల్లు సాంగ్‌కు మాస్‌ స్టెప్పులతో డ్యాన్స్‌ ఇరగదీశారు. మల్లారెడ్డి వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. 75 ఏళ్ల వయసులోనూ అంత ఎనర్జీతో స్టెప్పులు వేయడం చూసి షాకైపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు అట్లుంటది మన మల్లారెడ్డితో అని కామెంట్లు పెడుతున్నారు. వీడీయో కింద చూడండి.. https://twitter.com/i/status/1848252364978868390 ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29931/