schedule Saturday, July 04, 2026

వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే

calendar_today September 24, 2024
person dharshininews
వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే
వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే - నిర్మాణ పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు - వెల్లడించిన న్యాయవాది కె.గోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సర్వనెంబర్ 51లోని వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే విధించిందని జీ పీఏ హోల్డర్ అబ్దుల్ రజాక్ తరుపు న్యాయవాది కె.గోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సర్వేనెంబర్ 51, 5వ సర్వేనెంబర్ల విషయంలో వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. సర్వేనెంబర్ 51లో కట్కం వీరేందర్ అనే వ్యాపారి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని హైకోర్టులో ఫిటీషన్ వేశారు. ఈ మేరకు న్యాయ స్థానం వివాదాస్పద స్థలంలో నిర్మాణ పనులు నిలిపి వేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవాది గోపాల్ వెల్లడించారు. అదేవిధంగా ఇట్టి నిర్మాణ పనుల వద్ద పోలీసులు ఉండి సహకరించడంపై కోర్టు ప్రశ్నించినట్లు తెలిపారు. వివాదాస్పద స్థలంలో న్యాయం గెలిచిందని, ఆక్రమణలో ఉన్న వ్యాపారి ఖాళీ చేయక తప్పదని అన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు త్వరలోనే చేతికందుతాయని చెప్పారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29339/