schedule Friday, September 11, 2026

కారు, రెండు బైకుల ఢీ..!

calendar_today September 22, 2024
person dharshininews
కారు, రెండు బైకుల ఢీ..!
కారు, రెండు బైకుల ఢీ..! - బైకు నుంచి పడిపోయిన తండ్రీ కొడుకులు - ప్రాధమిక వైద్యం తరువాత ఉస్మానియాకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ కారు, రెండు బైకులు ఢీ కొన్న ప్రమాదంలో తండ్రీ కొడుకులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది, బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం గోనూరు గ్రామానికి చెందిన నరేందర్ కుమారుడు తుకారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో తండ్రి నరేందర్ తుకారాంను తాండూరు నుంచి గ్రామానికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. తన బైకుపై ఇద్దరు కలిసి గ్రామానికి బయల్దేరారు. పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పైకి రాగానే వెనుకనుంచి వచ్చిన ఓ బైకు ఢీ కొ్ట్టడంతో నరేందర్ బైకు కారును ఢీకొట్టి కుమారుడు తుకారంతో సహా కిందపడిపోయారు. ఈక్రమంలో వారిద్దరి తలలకు, శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి నరేందర్‌ కు చికిత్స అందించగా కుమారుడు తుకారాంను పట్టణంలోని ఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/29277/