schedule Saturday, September 05, 2026

హస్బెండ్‌కు ఫుల్ ఫ్రీడమ్..!

calendar_today September 17, 2024
person dharshininews
హస్బెండ్‌కు ఫుల్ ఫ్రీడమ్..!
హస్బెండ్‌కు ఫుల్ ఫ్రీడమ్..! - ఫ్రెండ్స్‌తో టూరుకు పర్మిషన్‌ - 100స్టాంపుపై నవ వధువు సంతకం - వరుడు స్నేహితుల పని వైరల్ దర్శిని డెస్క్ : పెళ్లయిన తరువాత మగవాళ్లకు ఫ్రీడమ్ ఉండదని ఓ సినిమాలోని డైలాగ్. నిజ జీవీతంలో కూడా మొగుళ్లకు స్వేఛ్చ ఉండదని చెబుతుంటారు. కాని ఇక్కడ ఓ నవ వధువు తన హస్బెండ్‌కు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నట్లు తెలిపారు. తన భర్త వారి స్నేహితులతో ఆనందంగా గడిపేందుకు, టూర్స్‌కు వెళ్లేందుకు పర్మిషన్‌ ఇస్తానని రూ. 100ల స్టాంపు పేపర్‌పై సంతకం చేసింది. వరుడు స్నేహితులు చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్‌పాడికి చెందిన ముత్తుకుమార్‌కు కురింజిపాడికి చెందిన పవిత్రతో సోమవారం వివాహం జరిగింది. వేడుకలో పాల్గొన్న ముత్తుకుమార్‌ స్నేహితులు.. వివాహం తర్వాత వరుడు ఇక తమను కలవడేమోనని బాధపడ్డారు. ఇందుకు పరిష్కారంగా రూ.100 స్టాంప్‌ పేపర్‌ తీసుకొచ్చి అందులో.. పెళ్లయిన తరువాత స్నేహితులతో ఆనందంగా గడపడానికి అనుమతిస్తానని, వారితో విహారయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోనని భార్య చెబుతున్నట్లు రాశారు. వధువుకు ఆ స్టాంప్‌ పేపర్‌ను వివరించి సంతకం పెట్టించుకున్నారు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సంతోషంగా సంతకం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29142/