schedule Saturday, July 04, 2026

దళిత యువకుడిపై దాడిలో ఘటనలో ట్విస్ట్..!

calendar_today September 13, 2024
person dharshininews
దళిత యువకుడిపై దాడిలో ఘటనలో ట్విస్ట్..!
దళిత యువకుడిపై దాడిలో ఘటనలో ట్విస్ట్..! - మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో వేధింపులు - యాలాల పోలీసులకు బాలిక కుటుంభీకులు ఫిర్యాదు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం ఎన్కెపల్లి గ్రామంలో దళిత యువకుడు మనోహర్ అనే యువకుడిపై దాడి జరిగిన ఘటన కొత్త మలుపు తీసుకుంది. యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధించినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన బీటి రాజేందర్, బీటి మహేందర్, భాస్కర్ గౌడ్, చెలుక బాలరాజ్, రాము, శ్రీనివాస్‌లు కిడ్నాప్‌ చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు కేవీపీఎస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే యువకుడు మనోహర్ పై గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు తమ కూతురును ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఆరోపించారు. తాండూరు పట్టణంలో చదువుతున్న ఆమెను బస్టాండ్ వద్ద, కాలేజీ వద్ద ప్రేమించాలని రెండు నెలలుగా వేధిస్తున్నట్లు వాపోయారు. ప్రేమించకుంటే పురుగుల మందు సేవిస్తానని వెంటపడుతున్నట్లు తమ కూతురు భయాందోళన చెందుతుందని తెలిపారు. ఈ విషయంపై యాలాల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. తమ కూతురును కాపాడాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/29008/