schedule Wednesday, November 11, 2026

రేణుకా ఎల్లమ్మకు గాజుల ఉత్సవం

calendar_today August 16, 2024
person dharshininews
రేణుకా ఎల్లమ్మకు గాజుల ఉత్సవం
రేణుకా ఎల్లమ్మకు గాజుల ఉత్సవం - ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం - దర్శించుకున్న పట్టణ భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్ లో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ అమ్మవారికి గాజుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారం చేశారు. గాజులతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజుల ఉత్సవంలో రేణుకా ఎల్లమ్మ దర్శనం నయనాందనం కలిగించింది. ఆలయానికి వచ్చిన పట్టణ భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి అంబరేష్ అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28407/