schedule Thursday, September 10, 2026

తాండూరు పట్టణ సీఐకి బెస్ట్ అవార్డు..!

calendar_today August 15, 2024
person dharshininews
తాండూరు పట్టణ సీఐకి బెస్ట్ అవార్డు..!
తాండూరు పట్టణ సీఐకి బెస్ట్ అవార్డు..! - ఓ కేసును చేధించినందుకు దక్కిన గౌరవం - స్పీకర్, కలెక్టర్, ఎస్సీ, ఎమ్మెల్యేల సమక్షంలో అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ బెస్ట్ అవార్డును పొందారు. గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా తాంండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డిల సమక్షంలో సీఐ సంతోష్‌ కుమార్ ఉత్తమ పోలీసు సీఐ అవార్డును అందుకున్నారు. ఇటీవల తాండూరులో జరిగిన సంచలనాత్మక ఫేక్ కరేన్సీ నోట్ల గుట్టును రట్టు చేసిన కేసులో సీఐ సంతోష్‌ కుమార్‌కు ప్రశంసలు దక్కాయి. ఈ కేసులో సీఐ సంతోష్ కుమార్ పనితీరును మెచ్చి ఉత్తమ సీఐ అవార్డును ప్రకటించారు. ఈఅవార్డును దక్కించుకోవడం పట్ల సీఐ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తమ అవార్డు అందుకున్న సీఐ సంతోష్ కుమార్‌కు పలువురు అభినందనలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28388/