schedule Saturday, July 04, 2026

గుట్కా కేసులో వ్యాపారికి ఊరట..!

calendar_today August 13, 2024
person dharshininews
గుట్కా కేసులో వ్యాపారికి ఊరట..!
గుట్కా కేసులో వ్యాపారికి ఊరట..! - కేసు ఎత్తివేసి, సీజ్ చేసిన ప్యాకెట్ల రిలీజ్‌కు ఆదేశం - వ్యాపారికి తిరిగి అప్పగించిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్కా కేసులో ఓ వ్యాపారికి ఊరట కలిగింది. వ్యాపారిపై నమోదైన కేసును ఎత్తివేయాలని, సీజ్ చేసిన ప్యాకెట్లను రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూరు పట్టణ పోలీసులు గత 25 రోజుల క్రితం గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద ఉన్న ఓ గోదాంలో అజయ్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తికి చెందిన ప్యాకెట్లను కూడా సీజ్ చేశారు. ఈ మేరకు తాండూరు పోలీసులు అజయ్ సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదు చేశారు. దీని తరువాత వ్యాపారి అజయ్ సింగ్ ఠాకూర్ కోర్టును ఆశ్రయించారు. ఇందులో తాను గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచుకోలేదని, పాన్‌ మసాల.. తంబాకును విడివిడిగా నిల్వ ఉంచినట్లు ఫిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది నిషేధిత గుట్కా వ్యాపారం కిందకి రాదంటూ కోర్టు తేల్చిందని వ్యాపారి మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. దీంతో కోర్టు తనపై నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని, సీజ్ చేసిన ప్యాకెట్లను తిరిగి అందించాలని ఉత్తర్వులు జారి చేసిందని వివరించారు. ఈ మేరకు పోలీసులు తనపై కేసును కొట్టివేస్తూ... ప్యాకెట్లను తిరిగి అప్పగించారని తెలిపారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28343/