schedule Thursday, September 10, 2026

కాంగ్రెస్ నేతలపై కౌంటర్ కేసు..!

calendar_today August 10, 2024
person dharshininews
కాంగ్రెస్ నేతలపై కౌంటర్ కేసు..!
కాంగ్రెస్ నేతలపై కౌంటర్ కేసు..! - విద్యావేత, కౌన్సిలర్, కూతురులపై నమోదు - ఆదర్శనగర్‌ భూ వివాదంలో ట్విస్ట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ సాయిపూర్ శివారులోని భూ వివాదంలో మలుపులు ఏర్పడుతున్నాయి. ఈ భూమి విషయంలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ చారి, మరికొందరిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు పెట్టిన వారిపై కౌంటర్ కేసు నమోదయ్యింది. తాండూరు పట్టణానికి చెందిన ఎం. నరేందర్ ఈ ఫిర్యాదును చేశారు. పట్టణంలోని సర్వే నెంబర్‌ 142లో తన పేరుపై 10 గుంటలు, మేనమామకు 15 గుంటలు, బావమరిదిలపై 15 గుంటలు మొత్తం 1 ఎకరా ఉందని తెలిపారు. ఈ భూమిపై డీఐ సర్వే చేపట్టి స్వాదీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈనెల 1న తమ భూమిలో కట్టెలను, ఫెన్సింగ్ వైరును ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అదేరోజు సాయంత్రం విద్యావేత్త రంగారావు, కౌన్సిలర్ విజయదేవి, వారి కూతురు సిందూలు తమ భూమిలోకి అక్రమంగా చొరబడినట్లు ఆరోపించారు. కట్టెలు, వైర్లను తొలగించి నష్టం కలిగించారని తెలిపారు. అంతేకుండా అంతేకాకుండా దుర్భాషలాడుతూ చంపేస్తామని బెధిరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వారిపై సెక్షన్ 329(3), 324(4), 352, 351(2), ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్‌ఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28161/