schedule Saturday, September 05, 2026

తోటి కుక్కకు రక్తదానం..!

calendar_today August 2, 2024
person dharshininews
తోటి కుక్కకు రక్తదానం..!
తోటి కుక్కకు రక్తదానం..! - ప్రాణాలను కాపాడిన వైద్యుడి పెంపుడు కుక్క దర్శిని డెస్క్ : ఓ శునకం మరో శునకానికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కుక్కకు వైద్యుడు తన పెంపుడు కుక్క నుంచి రక్తం సేకరించి దాని ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి పెంపుడు కుక్క (లాబ్రడార్‌) అస్వస్థతకు గురైంది. దాన్ని నగరంలోని ఓ వెటర్నరీ క్లినిక్‌కు తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్‌ తక్కువైందని, రక్తం ఎక్కించాలని పశువైద్యాధికారి ప్రొఫెసర్ బసవరాజ్‌ పూజార్‌ గుర్తించారు. దానికి రక్తం ఎక్కించకపోతే.. అది కోలుకోవడం కష్టం అని వెంటనే తన పెంపుడు శునకం భైరవ (డాబర్‌మన్‌)ను పరీక్షించి దాన్నుంచి 300 మి.లీ. రక్తం సేకరించి తొమ్మిదేళ్ల లాబ్రడార్‌కు ఎక్కించారు. అనంతరం అది కోలుకున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28020/