schedule Thursday, September 10, 2026

పిచ్చోడి వీరంగం..!

calendar_today July 12, 2024
person dharshininews
పిచ్చోడి వీరంగం..!
పిచ్చోడి వీరంగం..! - మనషులపై దాడి - చితక బాదిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని వినాయక చౌరస్తా సమీపంలోని కూరగాయల మార్కెట్‌లో గుర్తుతెలియని యువకుడు పిచ్చెక్కిన మాదిరి మనషులపై దాడి చేయడం, కొరకడం చేశాడు. అటూ ఇటూ తిరుగుతూ వీరంగం సృష్టించాడు. జంకుతున్న జనం యువకున్ని చితకబాదారు. అనంతరం యువకున్ని పోలీసులకు అప్పగించారు. మరోవైపు యువకుడి దాడిలో గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందారు. యువకుడు గత రెండు రోజులుగా వీరంగం చేస్తున్నాడని, అయితే మత్తులో చేస్తున్నాడా.. లేక పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా అనేది అర్థకం కాలేదు. ప్రస్తుతం యువకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27695/